DSports Jan05 2026: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన అన్ని రకాల ప్రసారాలు, ప్రకటనలు మరియు ప్రమోషన్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నిషేధం వెనుక అసలు కారణం బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడమే.కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరియు మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎటువంటి తర్కం లేకుండా తమ ఆటగాడిని తొలగించడం తమ దేశ ప్రజలను అవమానించడమేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana