
DET:SEP18:
కాంతారా చాప్టర్ 1:తెలుగు రైట్స్ రికార్డు సృష్టించాయి:
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన ‘కాంతారా’ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కేవలం ₹15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా,ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుతం చేసింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా వస్తున్న’కాంతారా: చాప్టర్ 1’పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.ఈ క్రేజ్ ఎంత ఉందో చెప్పడానికి తాజాగా ఒక ఉదాహరణ బయటపడింది.
తెలుగు థియేట్రికల్ హక్కులకు భారీ ధర
కాంతారా: చాప్టర్ 1′ తెలుగు థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.ఈ సినిమా రైట్స్ ₹100 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో ధర పలకడం ఇది తొలిసారి అని అంటున్నారు.ఈ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు వివిధ ప్రాంతాల వారీగా దక్కించుకున్నాయి.నిజాం ఏరియా రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకోగా,ఉత్తరాంధ్రలో విఘ్నేశ్వర డిస్ట్రిబ్యూటర్స్,తూర్పు,పశ్చిమ గోదావరిలో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్,కృష్ణాలో ఓకేఎస్ఎన్ టెలి ఫిల్మ్స్ వంటి పెద్ద సంస్థలు పంపిణీ బాధ్యతలను తీసుకున్నాయి.
భారీ బిజినెస్‌కు కారణం ఇదే!
ఈ రికార్డ్ ప్రీ-సేల్స్ సినిమాపై ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.’కాంతారా’ అందించిన విజయం,ఆ సినిమాలోని కంటెంట్ రిషబ్ శెట్టి టాలెంట్..ఇవన్నీ కూడా బయ్యర్స్ లో భారీ నమ్మకాన్ని పెంచాయి.అంతేకాకుండా,మొదటి సినిమా కంటే చాప్టర్ 1 భారీ బడ్జెట్‌తో,హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో రూపొందుతోంది.ఈ విషయాలన్నీ కలిసి తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ఇంత భారీ బిజినెస్ జరగడానికి కారణమయ్యాయి.ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
