
DET:SEP19:
మహావతార్ నరసింహ ఓటీటీలో వచ్చేస్తున్నాడు!
సంచలన విజయం సాధించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా ఓటీటీ ప్రేక్షకుల కోసం వచ్చేసింది.సినిమా సెప్టెంబర్ 19, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలైంది.ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అదే రోజు అందుబాటులోకి వచ్చింది.థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఈ బ్లాక్‌బస్టర్ యానిమేషన్ చిత్రాన్ని చూడవచ్చు.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయం
చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం,విజువల్ ఎఫెక్ట్స్,యానిమేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగు,కన్నడ,తమిళం,మలయాళ భాషల్లోనూ విడుదలైంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఎక్కడ చూడవచ్చు?
ఇప్పుడు,నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగుతో సహా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.థియేటర్లలో చూడలేని వారు,లేదా మరోసారి చూడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఈ అద్భుతమైన యానిమేషన్ చిత్రాన్ని చూడవచ్చు.’మహావతార్ నరసింహ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు,భారతీయ పౌరాణిక కథలను ఆధునిక సాంకేతికతతో ఎలా చెప్పవచ్చో చూపించిన ఒక కొత్త మార్గం.
