DET:DEC 30:
గుర్తుపట్టలేనంతగా మారిన జగపతి బాబు:
టాలీవుడ్ వెటరన్ యాక్టర్ జగపతి బాబు తన ప్రతిభతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు.కానీ పెద్ది సినిమాలో ఆయన పోషిస్తున్న అప్పలసూరి లుక్ మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మాసిన గడ్డం,చెదిరిన జుట్టు,కళ్ళజోడుతో చాలా సహజంగా ఒక పక్కా గ్రామీణ వ్యక్తిలా ఆయన కనిపిస్తున్నారు.ఈ లుక్ చూస్తుంటే జగపతి బాబు తన పాత్ర కోసం ఎంతగా కష్టపడ్డారో అర్థమవుతోంది.

రామ్ చరణ్ ప్రశంసల వర్షం:
ఈ ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా చిత్ర యూనిట్‌తో పాటు హీరో రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగపతి బాబు వంటి నటుడు తన సినిమాలో ఉండటం గర్వకారణమని,అప్పలసూరి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చరణ్ కొనియాడారు.వీరిద్దరి కాంబినేషన్ గతంలో రంగస్థలంలో ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది.

అప్పలసూరి పాత్ర ప్రాధాన్యత:

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కథను ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా మలుస్తున్నారు.ఇందులో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుందని సమాచారం.అప్పలసూరి అనే ఈ పాత్ర సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని జగపతి బాబు నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27,2026న విడుదల కానుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana