
DET:DEC 30:
రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్:
తాజా సమాచారం ప్రకారం ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏకంగా రూ.600 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.భారతీయ సినీ చరిత్రలోనే ఒక సినిమా ఓటీటీ హక్కుల కోసం ఇంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి.అల్లు అర్జున్ క్రేజ్ మరియు అట్లీ మేకింగ్ స్టైల్ పై ఉన్న నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయి డీల్ కు సిద్ధమైనట్లు సమాచారం.
పుష్ప-2 రికార్డు కనుమరుగు:
ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం రూ.275 కోట్ల ఓటీటీ డీల్‌తో టాప్ లో ఉండేది.ఇప్పుడు అట్లీతో చేస్తున్న ఈ సినిమా ఆ రికార్డును రెట్టింపు కంటే ఎక్కువ ధరతో బద్దలు కొట్టింది.కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే రూ 600 కోట్లు రావడం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు.
వెయ్యి కోట్ల బడ్జెట్ – భారీ తారాగణం:
ఈ సినిమాను దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణే,మృణాల్ ఠాకూర్,జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రష్మిక మందన్న మొదటిసారి విలన్ పాత్రలో కనిపిస్తుందని టాక్.హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తుండటంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అభిమానుల్లో ఉత్సాహం:
రిలీజ్‌కు ముందే ఇలాంటి రికార్డులు సృష్టిస్తుండటంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.ఇదీ మా హీరో రేంజ్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.2027 సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
