D Spiritual: Dec 26: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం గురువారం భారీ భక్తుల రద్దీతో జనసంద్రంగా మారింది. సాధారణంగా వారాంతాలు, వరుస సెలవు రోజుల్లో ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే గత కొన్ని రోజులుగా శబరిమల ఆలయంలో దర్శనాలు ప్రారంభం కావడంతో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు, అలాగే ఓంశక్తి మాలధారణ చేసిన భక్తులు కాణిపాకం ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా కాణిపాకం స్వామి దర్శనానికి వచ్చారు. సాధారణ భక్తులతో పాటు తిరుమల వెళ్లే తీర్థయాత్రికులు, అయ్యప్ప, ఓంశక్తి భక్తులు తరలిరావడంతో ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొంది. వేకువజామున నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరి నిలబడటంతో ఆలయంలోని అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి.

ఆలయ క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయం వెలుపల కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సర్వదర్శనంతో పాటు రూ.100 శీఘ్ర దర్శనం, రూ.150 అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు సైతం క్యూలైన్లలో దీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు సుమారు నాలుగు గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి దర్శన ప్రక్రియను సాఫీగా కొనసాగిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana