
DSports Dec23 2025:విశాఖపట్నం: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినా, ఫీల్డింగ్ వైఫల్యాలు మాత్రం జట్టును వేధిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఐదు సులువైన క్యాచ్‌లను జారవిడిచారు. 2025 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇలాంటి తప్పిదాలే టీమిండియాను ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు మళ్ళీ అవే పునరావృతం కావడంపై విమర్శలు వస్తున్నాయి.
- మ్యాచ్ ఆరంభంలోనే శ్రీలంక ఓపెనర్లకు భారత ఫీల్డర్లు లైఫ్ ఇచ్చారు. వైష్ణవి శర్మ బౌలింగ్‌లో శ్రీచరణి క్యాచ్ వదిలేయడం వల్ల ఒక యువ స్పిన్నర్‌కు దక్కాల్సిన తొలి అంతర్జాతీయ వికెట్ చేజారింది.మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “మేం మా ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఎందుకు వరుసగా క్యాచ్‌లు చేజారుతున్నాయో అర్థం కావడం లేదు. వచ్చే మ్యాచ్ కల్లా ఈ లోపాలను సరిదిద్దుకుంటాం” అని పేర్కొన్నారు.ప్రపంచకప్ విజయం తర్వాత జట్టుకు సుమారు ఆరు వారాల విరామం లభించింది. ఈ విరామం వల్లే ప్లేయర్లు ఫీల్డింగ్‌లో లయను అందుకోలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఫీల్డింగ్‌లో ఖచ్చితత్వం పెంచుకోవాలని కోచ్ అమోల్ ముజుందార్ కూడా జట్టును హెచ్చరించినట్లు సమాచారం.
