
DSports Dec22 2025:రోహిత్ శర్మ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడో టెస్టులోనూ ఓడిపోయి, సిరీస్‌ను 0-3తో కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా మూడో మ్యాచ్ కూడా ఓడిపోవడంతో ఇంగ్లండ్ మీడియా మరియు మాజీ ప్లేయర్లు తమ జట్టుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
