
DSports Dec22 2025: టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో విష్మి గుణరత్నే (39) టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (25) చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ టీ20ల్లో 4,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డుకెక్కారు. అంతేకాకుండా, బంతుల పరంగా (3227 బంతులు) అతివేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా ప్రపంచ రికార్డును తన పేరున లిఖించుకున్నారు.జెమీమా రోడ్రిగ్స్ మెరుపులు 122 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ కేవలం 44 బంతుల్లో 10 ఫోర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. తన అద్భుత ప్రదర్శనకు గాను జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15 నాటౌట్) తో కలిసి జెమీమా జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత్ మరో 32 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
