
DSports Dec22 2025: దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత యువ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ తుది పోరులో టీమిండియా 191 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాకిస్థాన్ తన చరిత్రలో రెండోసారి (మొదటిసారి పూర్తిస్థాయిలో) ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది.13 ఏళ్ల నిరీక్షణ తర్వాత పాకిస్థాన్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది (గతంలో 2012లో భారత్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది). టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత కుర్రాళ్లు, కీలకమైన ఫైనల్లో మాత్రం ఒత్తిడికి లోనై ‘ఫ్లాప్ షో’ ప్రదర్శించారు.
