DET:DEC 22:
బిగ్ బాస్ 9 విజేతగా కళ్యాణ్ పడాల:
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఘనంగా ముగిసింది.సుమారు 105 రోజుల పాటు సాగిన ఈ రసవత్తర పోరులో ఆర్మీ జవాన్ మరియు కామనర్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచారు.ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున కళ్యాణ్ పేరును విజేతగా ప్రకటించి ట్రోఫీని అందజేశారు.

స్క్రీన్ పోల్ అంచనాలు నిజమయ్యాయి:
ఫినాలేకు ముందే సోషల్ మీడియాలో నిర్వహించిన పలు సర్వేలు ముఖ్యంగా కళ్యాణ్ పడాల గెలుస్తాడని ముందే అంచనా వేశాయి.ఈ పోల్‌లో కళ్యాణ్‌కు దాదాపు 64 శాతానికి పైగా ఓట్లు రావడం గమనార్హం.ప్రేక్షకుల మద్దతు మొదటి నుంచీ ఆయనకే ఎక్కువగా ఉండటంతో అంచనాలకు తగ్గట్టే ఆయన విజయం సాధించారు.

గట్టి పోటీ ఇచ్చిన తనూజ:
ఈ సీజన్‌లో కళ్యాణ్‌కు నటి తనూజ పుట్టస్వామి గట్టి పోటీని ఇచ్చారు.చివరి నిమిషం వరకు వీరిద్దరి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగింది.అయితే ఓటింగ్ పరంగా కళ్యాణ్ ఆధిక్యంలో ఉండటంతో తనూజ రన్నరప్‌గా నిలిచారు.ఒక మహిళా విన్నర్‌ని చూడాలనుకున్న అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించినా తనూజ తన ఆటతీరుతో అందరి మనసు గెలుచుకుంది.

ప్రైజ్ మనీ మరియు బహుమతులు:
విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాలకు భారీ బహుమతులు లభించాయి.ఆయనకు రూ 35 లక్షల నగదు బహుమతితో పాటు ఒక సరికొత్త మారుతీ సుజుకీ విక్టోరియస్ SUV కార్ మరియు స్పాన్సర్ల నుండి అదనంగా రూ.5 లక్షలు అందాయి.నిజానికి ప్రైజ్ మనీ రూ.50 లక్షలు ఉన్నప్పటికీ మరో కంటెస్టెంట్ డీమాన్ పవన్ రూ.15 లక్షలు తీసుకుని మధ్యలోనే తప్పుకోవడంతో విజేతకు అందే మొత్తం రూ. 35 లక్షలకు తగ్గింది.

సామాన్యుడి గెలుపు – సరికొత్త చరిత్ర:
కళ్యాణ్ పడాల విజయం బిగ్ బాస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.సామాన్యుల కోటా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన నిజాయితీ మరియు కష్టపడే తత్వంతో కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.ఒక సైనికుడిగా దేశానికి సేవ చేస్తూనే రియాలిటీ షోలో కూడా తన సత్తా చాటి విజేతగా నిలవడం అందరికీ స్ఫూర్తిదాయకం.