
DSports Dec20 2025:అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-3తో కోల్పోవడంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులోనూ విజయం ముంగిట బోల్తా పడటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ ఓటమి తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో మార్క్రమ్ మాట్లాడుతూ.. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తమ జట్టుకు మంచి ఆరంభం లభించినా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పారు.
