DNews:19 Dec: మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుంది అంటూ, ఇన్ని రోజులు ఎదురుచూసిన తాను త్వరలోనే మంత్రి పదవి పొందుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలంగా మంత్రి పదవి అంశంపై బహిరంగంగానే మాట్లాడుతున్న విషయం తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదని, ఈ విషయంపై గతంలో అనేకసార్లు మీడియా సమావేశాల్లో తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేకాదు, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని, తనకు మంత్రి పదవి లభిస్తే మరింత వేగంగా అభివృద్ధి పనులు చేయగలనని ఆయన అన్నారు. ప్రస్తుతం మంత్రి పదవిపై సానుకూలంగా మాట్లాడటంతో, రాజగోపాల్ రెడ్డికి ఏమైనా సంకేతాలు అందాయా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మంత్రి మండలి విస్తరణపై ఊహాగానాలు సాగుతున్న వేళ, కోమటిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana