
DNews:19 Dec: వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు మేఘారెడ్డి . ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన ఆయన, బయటివాళ్ల కారణంగా కాదు… పార్టీ లోపలే ఉన్న ఇంటి దొంగల వల్లే తాము ఓటమి పాలయ్యామని సంచలన ఆరోపణలు చేశారు.పార్టీ కోసం సంవత్సరాల పాటు పనిచేసినా, ఎన్నికల సమయంలో కొందరు నేతలు ప్రత్యర్థులకు పరోక్షంగా సహకరించారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారే చివరకు పార్టీకి నష్టం చేశారని, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపారని విమర్శించారు.
ఇకపై పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా లోపలి లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించని, స్వార్థ రాజకీయాలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలు వనపర్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
