D Spiritual: Dec 17: దీక్షా విరమణల ముగింపు:
దీక్షా విరమణలు సోమవారం ముగిశాయి. ఐదు రోజుల పాటు దుర్గమ్మను ఐదు లక్షల మందికి పైగా భవానీలు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాలు వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు, సామాన్య భక్తులు దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది.

భారీగా తరలివచ్చిన భవానీలు:
తెల్లవారుజాము నుంచే భవానీలు విజయవాడకు భారీగా చేరుకున్నారు. సోమవారం అమ్మవారిని దర్శించుకుని దీక్షను విరమించారు. ముందుగా గిరి ప్రదక్షిణ చేసి, అనంతరం కనకదుర్గమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఇంకా రెండు రోజుల పాటు భవానీలు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శన ఏర్పాట్లు:
భవానీల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇవాళ (మంగళవారం), రేపు (బుధవారం) దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో కూడా భారీ సంఖ్యలో భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వీఐపీ ప్రోటోకాల్ రద్దు:
భవానీలు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో శీనానాయక్, ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

అధికారుల సూచనలు:
ఐదు రోజుల వ్యవధిలో ఐదు లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారని, ఇవాళ మరియు రేపు కూడా భవానీల రద్దీ కొనసాగుతుందని తెలిపారు. గురు భవానీల సమక్షంలో మాల విరమణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు రోజుల పాటు వీఐపీలకు కూడా దర్శనాలు కల్పించలేమని స్పష్టం చేస్తూ, వీఐపీ భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో శీనానాయక్ సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana