D Spiritual: Dec 15: పైడితల్లి గజపతుల వారి ఆడపడుచు అని ముందుగానే మనకు తెలుసు. విజయనగరం రాజు మరియు బొబ్బిలి రాజు మధ్య అప్పట్లో ఘోరమైన యుద్ధం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఆ యుద్ధకాలంలో రామరాజు సోదరి అయిన పైడిమాంబ మసూచి వ్యాధితో బాధపడుతూ ఉండిందట.

ఒకరోజు పైడిమాంబ పూజలో లీనమై ఉన్న సమయంలో, తాండ్ర పాపా రాయుడు యుద్ధంలో విజయ రామరాజును సంహరించినట్లు ఆమెకు తెలిసిందట. తన సోదరుడి మరణ వార్త విన్న పైడిమాంబ తీవ్ర దుఃఖంలో మునిగి, ఆ బాధను తట్టుకోలేక తనువు చాలించిందని కథనాలు చెబుతున్నాయి.

పైడిమాంబ మరణానంతరం ఆ రాజ్యంలో ఉన్న ఒక సైనికుడైన పతివాడ అప్పల నాయుడికి ఆమె కలలో దర్శనమిచ్చిందట. ఆ దర్శనంలో ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించింది.

ఆ సందేశం ఏమిటంటే—ఆ ప్రాంతంలోని ఒక సరస్సులో తన విగ్రహం ఉందని, పడమర వైపు నుంచి వెతికితే అది లభిస్తుందని తెలిపిందట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి, ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించిందట.

పైడితల్లి చెప్పిన విధంగానే చెరువులో వెతకగా విగ్రహం లభించిందని చెబుతారు. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఒక స్థలంలో ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆలయంలో నిత్య పూజలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana