
DET:DEC 13:
వెంకటేష్ గారికి మెగాస్టార్ ప్రత్యేక శుభాకాంక్షలు:
నటశేఖరుడు విక్టరీ వెంకటేష్ గారు 65వ వసంతంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా సినీ ప్రముఖులు,అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్‌కి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు.ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా మన శంకర వర ప్రసాద్ గారు సెట్స్‌లో తీసిన ఒక రేర్ ఫోటోని చిరంజీవి గారు షేర్ చేశారు.ఈ ఫోటోలో ఇద్దరు లెజెండ్లు చాలా సరదాగా,ఆప్యాయంగా కనిపిస్తున్నారు.వెంకటేష్‌తో కలిసి గడిపిన ప్రతీ క్షణం తనకు ఎంతో ప్రియమైనదని చిరంజీవి గారు పేర్కొన్నారు.
MSG సెట్స్ నుండి అరుదైన ఫోటో విడుదల:
చిరంజీవి గారు షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అభిమానులందరూ ఈ ఫోటో చూసి చాలా సంతోషిస్తున్నారు.తొలిసారిగా ఈ ఇద్దరు అగ్ర నటులు కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి గారి పోస్ట్ చూసిన ఫ్యాన్స్.వారిద్దరి స్నేహ బంధాన్ని,వృత్తి పట్ల వారి అంకితభావాన్ని కొనియాడారు.ఈ అరుదైన ఫోటో సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
అనిల్ రావిపూడి నుండి శుభాకాంక్షలు:
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు కూడా వెంకటేష్ గారికి తన పుట్టినరోజు శుభాకాంక్షలు పంపారు.వెంకటేష్ గారితో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ,ఆయన నిరాడంబరత,అంకితభావం గొప్పవని అనిల్ రావిపూడి కొనియాడారు.ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వెంకటేష్,చిరంజీవి కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
అభిమానుల ఆనందం:
వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు చిరంజీవి,అనిల్ రావిపూడిలకు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఈ స్టార్ల సందేశాలు వెంకటేష్ గారి పుట్టినరోజు వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.వెంకటేష్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని,ప్రేక్షకులు ఆయన నుండి మరిన్ని మంచి సినిమాలు ఆశించాలని కోరుకుంటున్నారు.
