
DET:DEC 12:
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న గోల్మాల్ 5 సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటీమణులు కరీనా కపూర్ ఖాన్ మరియు సారా అలీ ఖాన్ లను సంప్రదించినట్లు సమాచారం.
కరీనా,సారా పేర్లు తెరపైకి:
ప్రముఖ సినీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం గోల్మాల్ 5 టీమ్ కరీనా కపూర్ ఖాన్ మరియు సారా అలీ ఖాన్ ఇద్దరినీ సంప్రదించింది.వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించడం ఇదే తొలిసారి కానుంది.ఇప్పటికే కరీనా కపూర్ గోల్మాల్ రిటర్న్స్ గోల్మాల్ 3 సినిమాలలో నటించి ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇక సారా అలీ ఖాన్ గతంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సింబా సినిమాలో నటించింది.వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కథలో మార్పులు కునాల్ ఖేము కొత్త పాత్ర:
తాజా నివేదికల ప్రకారం ఈసారి గోల్మాల్ 5 మునుపటి భాగాల కంటే కొంచెం భిన్నంగా ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉండేలా రూపొందించాలని రోహిత్ శెట్టి ఆలోచిస్తున్నారట.ఈ క్రమంలో ఈ ఫ్రాంచైజీలో భాగమైన నటుడు కునాల్ ఖేము కూడా ఈసారి కేవలం నటుడిగానే కాకుండా క్రియేటివ్ అడ్వైజర్ గా స్క్రిప్ట్ పనుల్లో సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కొత్త ఆలోచన సినిమాకు కొత్త కోణాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు.
షూటింగ్ 2026లో ప్రారంభం:
ఈ బహుళ-అంచనాలతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం 2026లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 2025లో నటీనటుల తుది ఎంపిక పూర్తయి,ఆ తర్వాత 2026 మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా కూడా గోవా నేపథ్యంలో ఉండే అవకాశం ఉంది.ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తారనేది దాదాపు ఖాయం.
