
DET:DEC 12:
బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్ ఎంట్రీ:
భారతీయ నటుడు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు అయిన విద్యుత్ జమ్వాల్ ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.ప్రపంచ ప్రసిద్ధి చెందిన వీడియో గేమ్ స్ట్రీట్ ఫైటర్ లైవ్-యాక్షన్ అడాప్టేషన్ లో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా నుండి తాజాగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల అయింది.ఇది అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది.తన యాక్షన్ నైపుణ్యంతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న విద్యుత్,ఇప్పుడూ గ్లోబల్ స్క్రీన్ పైన కనిపించడానికి సిద్ధమవుతున్నారు.
పవర్ ఫుల్ ఫస్ట్ లుక్:
స్ట్రీట్ ఫైటర్ నిర్మాతలు విడుదల చేసిన విద్యుత్ జమ్వాల్ ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకర్షించింది.విద్యుత్ కండల తిరిగిన శరీరం,ధల్సిమ్ పాత్రకు సరిపోయే సాంప్రదాయ యోగి వేషధారణ,నుదుటిపైన ఉన్న మూడు గీతలతో ఆ పాత్రను అద్భుతంగా చూపించారు.ఈ లుక్ ధల్సిమ్ క్యారెక్టర్ని వీడియో గేమ్ నుండి నేరుగా సినిమాలోకి తీసుకువచ్చినట్లుగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.విద్యుత్ తన ఫిజిక్ మరియు మార్షల్ ఆర్ట్స్ టాలెంట్‌తో ఈ పాత్రకు సరైన ఎంపిక అని నిరూపించుకున్నారు.
స్ట్రీట్ ఫైటర్ వివరాలు:
స్ట్రీట్ ఫైటర్ లైవ్-యాక్షన్ అడాప్టేషన్ సినిమాకు కిటావో సకురై దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ తో పాటు నోహ్ సెంటినియో ,ఆండ్రూ కోజి,జాసన్ మొమోవా,డేవిడ్ దాస్ట్మాల్చియన్ వంటి హాలీవుడ్ ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు.ఈ చిత్రం అక్టోబర్ 16,2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ మూవీ టీజర్ కూడా విడుదలైన తర్వాత,ఇది వీడియో గేమ్ అభిమానులకు మరియు యాక్షన్ ప్రియులకు ఒక మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.
