D Spiritual: Dec 12: ఒకరి పాపాలు మరొకరికి అంటుతాయా? అంటుతాయని పండితులు చెబుతారు. అయితే ఎవరు చేసిన పాపాలు ఎవరికి సంక్రమిస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. ప్రజలు చేసే పాపాలు రాజుకు చేరుతాయి. రాజు చేసే పాపాలు పురోహితులకు అంటుతాయి. భార్య చేసిన పాపాలు భర్తకు, శిష్యుడు చేసిన పాపాలు గురువుకు సంక్రమిస్తాయి. మగపిల్లాడు తప్పు చేస్తే తల్లి, ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి బాధ్యులని శాస్త్రాలు చెప్పాయి.

శుభకార్యాల్లో ఆడవారి గొంతుకి చందనం పూయడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. భార్య తన ఇంటివారితో పాటు చుట్టాలు, స్నేహితులను కూడా ప్రేమగా పలకరించాలి. భర్త, అత్త, మామ వంటి వారితో మాట్లాడేటప్పుడు మాట సౌమ్యంగా, మృదువుగా ఉండాలి. చందనం మెడకు రాయడం వల్ల గొంతు తీయగా, సరళంగా వినిపిస్తుందని అంటారు.

కొన్ని సందర్భాల్లో చెప్పే విషయం వినయంగా ఉన్నా, మాట కఠినంగా అనిపిస్తే ఎదుటివారికి తప్పుడు భావన కలుగుతుంది. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరం సున్నితంగా ఉండేందుకు చందనం సహాయపడుతుంది. అంతేకాక, చందనం శుభానికి సూచకమైనది కావడంతో శుభకార్యాల్లో దీనిని ఉపయోగించే ఆచారం కొనసాగుతోంది.