
DSports Dec12, 2025: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడంపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కీలక వ్యూహాత్మక నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పుల వల్లే భారత్‌కు ఈ పరాభవం ఎదురైందని మాజీలు విశ్లేషించారు.
వన్-డౌన్లో అక్షర్ పటేల్‌ను పంపడమే ‘పెద్ద తప్పు’ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేశాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డకౌట్ అయిన వెంటనే, జట్టులోని అత్యుత్తమ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) కంటే ముందుగా లెఫ్ట్ హ్యాండర్ అక్షర్ పటేల్‌ను వన్-డౌన్లో (మూడో స్థానంలో) పంపడం విమర్శలకు
తావిచ్చింది.
తిలక్ వర్మ (62 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్లు మద్దతు ఇవ్వకపోవడంతో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.
