DSports Dec12, 2025: టీమిండియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ప్రొటీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక విజయాలు (Most T20 wins against India) సాధించిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు 51 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో పాటు, క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నారు.