
D Spiritual: Dec 12: పూర్వం సుబ్రహ్మణ్యస్వామి రాక్షస సంహారానికి కావలసిన శక్తులను పొందేందుకు తన తల్లిదండ్రులైన శివపార్వతులను చెన్నై నగర మధ్యలో ఉన్న మైలాపూర్ ప్రాంతంలో తపస్సు చేసాడని పురాణాలు చెబుతాయి. తపస్సుకు సంతృప్తిచెందిన పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడికి వేలాయుధాన్ని ప్రసాదించినట్లు చెప్పబడుతుంది.
ఆ అనంత శక్తులతో సుబ్రహ్మణ్యస్వామి రాక్షసులను సంహరించి, విజయం సాధించి సింగారవేల్గా తిరిగి వచ్చాడు. ఆయన విజయానంతరం ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికి వరంగా ఇచ్చి వారి వివాహాన్ని నిర్వహించాడని పురాణాలలో పేర్కొంటారు.
వివాహానంతరం సుబ్రహ్మణ్యస్వామి దేవసేనతో కలిసి ఇంద్రుడి వాహనమైన ఐరావతంపై స్వర్గలోకానికి వెళ్లి, అక్కడి నుంచి తిరిగి భూలోకంలోని మైలాపూర్ క్షేత్రానికి విచ్చేసాడట. అందుచేతనే ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి వల్లీ–దేవసేన సమేతంగా ఐరావతంపై కూర్చుని దర్శనమిస్తాడు. ఇటువంటి దర్శనం మరెక్కడా లభించదని, ఇది అత్యంత అరుదైన దైవదర్శనం అని పురాణాలు చెబుతాయి.
మైలాపూర్ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుంటే వివాహం కాని వారికి కల్యాణ యోగం, సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతాయని విశ్వాసం. ఈ క్షేత్రానికి చేరాలంటే ముందుగా చెన్నైకి వెళ్లి, అక్కడి నుంచి బస్సులు, ఆటోలు వంటి లోకల్ రవాణా సౌకర్యాలతో మైలాపూర్ కపాలీశ్వరస్వామి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
