D Spiritual: Dec 10: గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత భక్తులకు ఆలయ పూజారి శఠగోపం పెడతారు. భక్తుల తలపై శఠగోపం ఎందుకు పెడుతారనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. దేవాలయానికి వెళ్లే ముందు భక్తులు ఉదయాన్నే ఇంటి పనులు పూర్తి చేసుకుని ఆలయం వద్ద కాళ్లు శుభ్రం చేసుకుని, తలపై కొద్దిగా నీళ్లు చల్లి శుద్ధి చేసుకుని లోపలికి ప్రవేశిస్తారు. అనంతరం గుడి ప్రదక్షిణలు చేసి గర్భగుడికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. పూజ అనంతరం అర్చన, హారతి ఇస్తారు. తీర్థం ఇచ్చే ముందుగా పూజారి భక్తుల తలపై శఠగోపం పెట్టి ఆశీర్వదించడం సంప్రదాయంగా జరుగుతుంది.

ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రతి భక్తి హృదయంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. అక్కడ ఉన్న కొద్ది సేపు అయినప్పటికీ ఆధ్యాత్మిక వాతావరణం వల్ల మనసు ప్రశాంతతను అనుభవిస్తుంది. దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం, ఆశీర్వచనం, హారతి ప్రతిదానికి ప్రత్యేకమైన చరిత్ర, ఆధ్యాత్మికత కలిగి ఉంది. అందులో శఠగోపం కూడా ఒకటి.

శఠగోపం అర్థం ‘గోప్యం’ అని. అంటే దేవుడికి మన కోరికలను చెప్పేటప్పుడు అవి ఇతరులకు వినిపించకుండా మనసులోనే కోరుకోవాలి. శఠగోపం తలపై పెట్టే సమయంలో తలదించుకోవాలి. ఇది మనిషిలో ఉండే క్రోధం, మోహం, లోభం, మదం వంటి అహంకారాలను విడిచిపెట్టి దేవుడి ముందు వినయంతో నిలబడుతున్నామనే సూచన.

దేవాలయానికి వెళ్లిన రోజంతా ప్రశాంతత అనుభవించడానికి కారణం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం. ప్రసాదం, ఆశీర్వచనం వంటి ప్రతిదీ ప్రత్యేకత కలిగి ఉంది. శఠగోపం కూడా భక్తుని లోపలి నెగెటివ్ భావోద్వేగాలను తగ్గించి, దేవుడి ఆశీర్వాదాన్ని పొందేందుకు వినయం, పావిత్రతను సూచించే ఆచారం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana