DET:DEC 09:
మిస్టర్ బీన్ ఈజ్ బ్యాక్ మ్యాన్ వర్సెస్ బేబీ ఓటీటీ విడుదల తేదీ!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను నవ్వించిన మిస్టర్ బీన్ పాత్రధారి,ప్రముఖ హాస్యనటుడు రోవాన్ అట్కిన్సన్ మళ్లీ మన ముందుకు వస్తున్నారు.ఆయన నటించిన కొత్త కామెడీ అడ్వెంచర్ సిరీస్ మ్యాన్ వర్సెస్ బేబీ యొక్క ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.ఈ క్రిస్మస్ సందర్భంగా,నవ్వుల సునామీని సృష్టించడానికి ట్రెవర్ బింగ్లీగా ఆయన డిసెంబర్ 11,2025 న స్ట్రీమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఎక్కడ చూడాలి?మరియు ఎప్పుడంటే…
భారతదేశంలోని ప్రేక్షకులు మ్యాన్ వర్సెస్ బేబీ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ లో చూడవచ్చు.ఇది డిసెంబర్ 11,2025 న స్ట్రీమింగ్ కానుంది. మ్యాన్ వర్సెస్ బీ సిరీస్ తర్వాత అట్కిన్సన్ నుండి వస్తున్న మరో ప్రత్యేకమైన కామెడీ ఎపిసోడ్ ఇది.ఇందులో మొత్తం 4 భాగాలు ఉంటాయి.మీ క్రిస్మస్ సెలవులను సరదాగా మార్చుకోవడానికి ఈ సిరీస్ ఖచ్చితంగా చూడదగినది.

అట్కిన్సన్ కామెడీ అంటే ఎందుకంత క్రేజ్?
రోవాన్ అట్కిన్సన్ తన సంభాషణలు లేకుండా కేవలం ముఖ కవళికలు మరియు శరీర కదలికలతో నవ్వించడంలో దిట్ట.మిస్టర్ బీన్ మరియు జానీ ఇంగ్లీష్ వంటి పాత్రల ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన సాధారణ పనులు కూడా గొప్ప ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయడంఆ తర్వాత అతను వాటిని పరిష్కరించడానికి చేసే వెర్రి ప్రయత్నాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.మ్యాన్ వర్సెస్ బేబీ లో కూడా ఆయన తనదైన శైలిలో నవ్వులు పూయించడం ఖాయం.