DET:DEC 09:
కేదార్‌నాథ్ 7 ఏళ్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని గుర్తు చేసుకున్న సారా అలీ ఖాన్:
సారా అలీ ఖాన్ తన తొలి సినిమా కేదార్‌నాథ్ విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక హృదయాన్ని కదిలించే పోస్ట్‌ను పంచుకున్నారు.ఈ సినిమాలో తన సహనటుడు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గుర్తు చేసుకుంటూ సారా రాసిన మాటలు అభిమానులను ఎమోషనల్‌గా మార్చాయి.

ఆ మ్యాజికల్ రోజులు మళ్లీ కావాలి!

కేదార్‌నాథ్‌ సినిమా షూటింగ్ 2017లో జరిగింది.ఆ రోజులు మళ్లీ కావాలని ఒక్క క్షణం కూడా మార్చకుండా ఆ మధుర సమయాన్ని మళ్లీ అనుభవించాలని ఉందని సారా తన పోస్ట్‌లో రాశారు.ఆ రోజులను నేను ప్రతిరోజూ మిస్ అవుతున్నాను.కానీ ఆ సినిమా నాకు ఇచ్చిన నేర్పిన ప్రతిదానికీ నేను కృతజ్ఞురాలిని అని తెలిపారు.తనకిష్టమైన కేదార్ లోయకు వెళ్ళినప్పుడల్లా అది తనకి కొత్త విషయాలను నేర్పిస్తూ ప్రేమను పంచుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు.

సుశాంత్ ఇచ్చిన మంచి అలవాట్లు:
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన వల్లే తనకు కొన్ని మంచి అలవాట్లు పరిచయమయ్యాయని సారా చెప్పుకొచ్చారు.నాకు బ్లాక్ కాఫీ అలవాటు ట్రెక్కింగ్ పై ప్రేమ,చంద్రుడిపై ఆసక్తి,కెమెరా ముందు సహజంగా ఉండాలనే కోరిక ప్రేక్షకులకు కృతజ్ఞత,ఇంకా పహాడీ వంటకాలపై ఇష్టం.ఇవన్నీ నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సుశాంత్ అని రాశారు.

తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచిన సుశాంత్:
ఇవన్నీ ఒక ఎత్తైతే,అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడూ తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలని,నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సుశాంత్ గుర్తు చేశారని సారా కృతజ్ఞతలు చెప్పారు.ఈ సినిమా ప్రయాణం,జ్ఞాపకాలు తనకు ఇచ్చినందుకు దర్శకుడు అభిషేక్ కపూర్ తో పాటు రచయిత్రి కనికా ధిల్లాన్,ఇంకా తన అన్నయ్యలాంటి స్నేహితుడు జెహాన్ హండాకు కూడా సారా ధన్యవాదాలు తెలిపారు.