
DSports 9 Dec:కటక్: టీమిండియా స్టార్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 9) నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో, బుమ్రా కేవలం ఒక్క వికెట్ తీస్తేనే భారత క్రికెట్ చరిత్రలోనే ఏ ఇతర బౌలర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు.
టెస్ట్, వన్డే, టీ20… ఈ మూడు ఫార్మాట్లలోనూ 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచేందుకు బుమ్రాకు ఒకే ఒక్క వికెట్ అవసరం.
