
D Spiritual: Dec 6: మన హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రజలకు వాస్తు శాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉండటమే కాకుండా, వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో వాస్తు దోషం ఉండటం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా సమస్యలు పూర్తిగా తగ్గవు. అలాంటి సమయంలో వాస్తు నియమాల ప్రకారం కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంటి సమస్యలు దూరం అవుతాయని విశ్వసిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇత్తడితో తయారు చేసిన సూర్య భగవానుడి ప్రతిమను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి. పంచానికి వెలుగునిచ్చే సూర్యుడి ప్రతిమను అక్కడ ఉంచడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. సూర్యుడి ప్రతిమతో పాటు ఇత్తడితో తయారు చేసిన స్వస్తిక్ గుర్తును కూడా గుమ్మంలో వేలాడదీయడం మంచిదని చెబుతారు. ఇలా చేస్తే ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
అలాగే వాస్తు దోషం కారణంగా ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నట్లయితే, ఇంటి ఈశాన్య దిశలో ఒక భారీ ఇత్తడి పాత్రను ఉంచాలి. ఆ ఇత్తడి పాత్రను పూర్తిగా నీటితో నింపాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ పాత్రలోని నీటిని మార్చాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు ధన ప్రాప్తి పెరుగుతుందని నమ్మకం. భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందులు మన దరి చేరకుండా, సంపద స్థిరంగా నిలిచి ఇంటి వారు ధనవంతులు అవుతారని భావిస్తారు. ఈ విధానం పాటిస్తే జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.
