
DNews:03 Dec:దుబాయ్‌లో గల్ఫ్ కార్మికులు భారీగా నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన అనేక మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అమలుకావాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దుబాయ్ GWAC ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.
గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం సరైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేదని ఆందోళనకారులు ఆరోపించారు. వచ్చే బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వస్తుందని NRI బృందం హెచ్చరించింది.
✦ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన మూడు కీలక డిమాండ్లు:
సంపూర్ణ గల్ఫ్ బోర్డు ఏర్పాటు గల్ఫ్ కార్మికుల సమస్యలకు ప్రత్యేకంగా స్పందించే బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్.వచ్చే రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధుల కేటాయింపు ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల కోసం ప్రత్యేక ఫండ్ అవసరమని వాదన.గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికులకు ఇచ్చే ఎక్‌గ్రేషియా 5 లక్షలు ఇంకా అందని కుటుంబాలకు వెంటనే అందజేయాలి అనేక కుటుంబాలు ఇప్పటికీ ఈ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని కార్మికులు పేర్కొన్నారు.గత కొంత కాలంగా గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిరసన చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
