D Spiritual: Dec 3: ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన శరీరానికి 7–8 గంటలు నిద్రపోవడం చాలా అవసరమని చెబుతారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం, బిజీ లైఫ్‌లో నిద్రించడానికి సరైన సమయం కూడా దొరకడం లేదు. నిద్రపోవడం కూడా జీవితంలో ఒక సవాలుగా మారిపోయింది. సాధారణంగా చాలా మందికి రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అటువంటి పరిస్థితిలో వారు మధ్యాహ్నం నిద్రపోతారు. అయితే మధ్యాహ్నం నిద్ర లాభమా? నష్టమా? చాణక్యుడి అభిప్రాయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు మధ్యాహ్నం నిద్ర గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పగటి పూట నిద్రపోయేవారు త్వరగా చనిపోతారని ఆయన అంటాడు. చాణక్యుడి ప్రకారం, నిద్రిస్తున్న సమయంలో వ్యక్తి శ్వాసను ఎక్కువగా తీసుకుంటాడు. కనుక పగటి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదని ఆయన సూచించాడు.

అంతేకాదు, మధ్యాహ్నం నిద్రపోయే వ్యక్తుల విజయస్థాయి కూడా తగ్గుతుందని, పనితీరులో ఉత్తమ ప్రమాణం ఉండదని చాణక్యుడు చెప్పాడు. వీరి శక్తి సామర్థ్యాలు, లక్షణాలు పూర్తిగా బయటపడవని కూడా పేర్కొన్నాడు. చాణక్యుడు మాత్రమే కాదు, వైద్యులు కూడా పగటి పూట నిద్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు.

వైద్యుల ప్రకారం, మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20–30 నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. అయితే ప్రతిరోజూ 2–3 గంటలు నిద్రపోవడం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల గుండె కొట్టుకోవడంలో క్రమం మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అనేక విభిన్న అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది మాత్రమే కాదు, పగటి సమయంలో నిద్రపోయే వ్యక్తులు రాత్రి వేళ నిద్రపోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాత్రి త్వరగా నిద్రపోలేరు, పొద్దున్నే త్వరగా లేవలేరు.

అంతేకాదు, వీరి దినచర్య కూడా పాత రీతిలో కొనసాగదు. రాత్రి సరిపడా నిద్రపోలేక మధ్యాహ్నం నిద్రపోతారు. కానీ ఎక్కువ మంది మధ్యాహ్నం నిద్ర ప్రతికూలతను వ్యాపిస్తుందని నమ్ముతారు. శరీరానికి హానం జరగడమే కాదు, మధ్యాహ్నం నిద్రలేచిన తర్వాత మానసికంగా కూడా వ్యక్తికి అంత సానుకూలంగా అనిపించదు. అందువల్ల మధ్యాహ్నం నిద్ర అనేక విధాలుగా మంచిగా పరిగణించబడడం లేదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana