D Spiritual: Dec 3: మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రజలు ప్రతిరోజూ ఇంట్లో పూజ చేయటమే కాకుండా దేవాలయాలకు వెళ్లి దేవుని పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజూ దేవుని ఆరాధించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే కొంతమంది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఆలయాలకు వెళ్లి ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు, ముడుపులు చెల్లిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా, కోరిన కోరికలు నెరవేర్చి ఆ గణపతి ఆలయానికి వెళ్లాలంటే మనం వెళ్ళలనుకుంటే వెళ్ళలేమని, గణపతి అనుగ్రహం ఉంటేనే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగలమని ప్రజల నమ్మకం. ఇంతటి విశిష్టమైన ఆలయం ఎక్కడుందో, దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగుళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో, కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కొలువై ఉన్న కురుడుమలై శక్తి గణపతి ఆలయం ఎంతో విశిష్టత కలిగినది. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించారు. ఏక సాలగ్రామ శిలతో చేసిన ఈ గణపతి విగ్రహం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు—బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు—ప్రతిష్టించారని ఒక ప్రతీతి ఉంది. ఈ గణపతిని దర్శిస్తే కోరినా కోరికలు నెరవేరుతాయని విశ్వసించి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఈ ఆలయ చరిత్ర విషయంలో మరో విశేషం ఏమంటే, త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ శక్తి గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని స్థలపురాణం చెబుతుంది. అలాగే పాండవులు కూడా ఈ గణపతిని సేవించారని చెబుతారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతిరోజూ రాత్రి సమయంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారని స్థానికులు నమ్ముతారు.

ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడి లోపలి నుంచి స్తోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని అక్కడివారు చెబుతున్నారు. ఇంత విశిష్టత కలిగిన ఈ గణపతిని దర్శించాలని మనం అనుకుంటే సరిపోదు; ఆయన అనుగ్రహం మనపై ఉంటేనే దర్శించుకునే అవకాశం లభిస్తుందని ప్రజల విశ్వాసం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana