D Spiritual: Dec 3: ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదాయం పెరగకపోవడం, ఇంట్లో ఎప్పుడూ టెన్షన్ నెలకొనడం, మనసుకు శాంతి లేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. డబ్బు నిలవకపోవడం, చేస్తున్న పనులు ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల కొందరు దీనిని విధి కారణమని భావిస్తే, ఇంకొందరు అదృష్టం దూరమైందని అనుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం మాత్రం ఇంటిలో కొన్ని ప్రతీకలను సరైన దిశల్లో ఉంచితే జీవితం కొత్త మలుపు తీసుకుంటుందని సూచిస్తోంది. ఈ విషయంలో పండితులు చెబుతున్న కొన్ని సూచనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించాలంటే కేవలం పూజలే కాకుండా కొన్ని ప్రత్యేక విగ్రహాలను వాస్తు ప్రకారం సరైన చోట ఉంచడం కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. తాబేలు, ఏనుగు, ఆవు, ఒంటె, మరియు హంసల జత వంటి ప్రతీకలు కేవలం అలంకరణ మాత్రమే కాకుండా జీవితానికి శుభదాయక మార్పులు తీసుకువచ్చే శక్తి కలవని వారు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం తాబేలు విగ్రహం ఇంట్లో ఉంచితే ఆర్థిక స్థితిలో స్థిరత్వం వస్తుందని విశ్వసిస్తారు. తాబేలును విష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు. డ్రాయింగ్ రూమ్‌లో తూర్పు లేదా ఉత్తర దిశలో తాబేలు ఉంచితే డబ్బు సమస్యలు తగ్గతాయని, ఆదాయ మార్గాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపార నష్టాలు తగ్గడం, కొత్త అవకాశాలు లభించడం వంటి మార్పులు తాబేలు ప్రతీకతో సాధ్యమవుతాయని చెబుతున్నారు.

అలాగే ఏనుగు విగ్రహం ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అనేక మంది నమ్మకం. ముఖ్యంగా వెండి ఏనుగు విగ్రహాన్ని తూర్పు దిశలో ఉంచితే కుటుంబ కలహాలు తగ్గి, ఇంట్లో ఆనందం పెరుగుతుందని చెబుతారు. ఉద్యోగం, వ్యాపారంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగి స్థిరత్వం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. వాయువ్య దిశలో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల నిలిచిపోయిన పనులు కదలికలోకి రావడం, వ్యాపారాలు వేగంగా పురోగమించడం వంటి అనుభవాలు చాలామందికి వచ్చాయి.

వైవాహిక జీవితంలో అనుకూలతలు తగ్గాయని అనుకునే వారికి ఒక జత హంసల విగ్రహం ఎంతో శుభదాయకమని పండితుల అభిప్రాయం. బెడ్‌రూమ్‌లో ఉత్తర వైపున వీటిని ఉంచితే భార్యాభర్తల మధ్య అపోహలు తొలగి, ప్రేమాభిమానాలు మరింత బలపడతాయని నమ్మకం. దాంపత్య జీవితంలో మాధుర్యం తిరిగి రావడానికి హంసల జంట ప్రతీకగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఇవన్నిటితో పాటు ఇంట్లో ఆవు విగ్రహం ఉండటం మహా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను, పిల్లలకు మంచి భవిష్యత్తును, ఇంటిలో శాశ్వత ఆనంద వాతావరణాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రతీకలను శుభ్రతతో కూడిన, వెలుతురు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఉంచితే ఫలితాలు మరింత బలంగా కనిపిస్తాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana