
DSports 2 Dec:న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. బీహార్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ద్వారా ఆయన భారత క్రికెట్ భవిష్యత్తుపై తనదైన ముద్ర వేశారు.
అస్సాంపై అద్భుత శతకం గురువారం (నవంబర్ 27, 2025) జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో బీహార్ జట్టు.. అస్సాంతో తలపడింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 63 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. వైభవ్ ధాటికి బీహార్ జట్టు 20 ఓవర్లలో 178 పరుగుల భారీ స్కోరు సాధించింది.
