
DSports 2 Dec:రాయ్‌పూర్:టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి రాయ్‌పూర్‌లో అపూర్వ స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3, 2025) జరగబోయే రెండో వన్డే కోసం భారత జట్టు రాయ్‌పూర్ చేరుకోగా, హోటల్ వద్ద కోహ్లీని చూసిన చిన్నారులు ఎంతో ఉత్సాహంతో గులాబీలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
చిరునవ్వుతో గులాబీలు అందుకున్న కోహ్లీ: రాంచీలో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ (135 పరుగులు)తో భారత్‌ను గెలిపించిన తర్వాత, కోహ్లీ మంగళవారం రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. హోటల్‌లోకి వెళ్లే సమయంలో చిన్నారులు కోహ్లీని చుట్టుముట్టారు. చేతిలో ఎర్ర గులాబీలను పట్టుకున్న ఆ చిన్న అభిమానులు.. వాటిని ఒక్కొక్కరిగా కోహ్లీకి అందించారు. చిన్నారుల నిష్కల్మషమైన ఆదరాభిమానాలను చూసిన కోహ్లీ.. చిరునవ్వుతో గులాబీలను అందుకుంటూ, వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
