DNews:02 Dec:హైదరాబాద్‌ హయత్‌నగర్‌ శివగంగ కాలనీలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల ప్రేమ్‌చంద్‌పై 10–20 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి చెవి ఊడి పోగా, తల, వెన్ను, నడుము ప్రాంతాల్లో లోతైన గాయాలు అయ్యాయి.

ప్రేమ్‌చంద్‌ పుట్టుకతోనే మూగవాడైనందున సహాయం కోసం అరిచే పరిస్థితి లేకపోవడంతో, పరిస్థితి మరింత విషమించింది. బాలుడి తల్లిదండ్రులు తిరుపతిరావు–చంద్రకళలు ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాకు చెందినవారు. గత మూడేళ్లుగా శివగంగ కాలనీలో కిరాయికి ఉంటున్నారు. ఘటన జరిగిన సమయంలో తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది.

కుక్కలు బాలుడిపై దాడి చేస్తుండగా స్థానికులు గమనించి వెంటనే తరిమివేసి ప్రేమ్‌చంద్‌ను రక్షించారు. తీవ్రగాయాల కారణంగా మొదట నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌కు తరలించగా, అనంతరం నిలోఫర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ప్రస్తుతం అతడు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నాడు.నగరంలో చిన్నారులపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కనీసం ఇప్పుడైనా జీహెచ్ఎంసీ స్పందించి శునకాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana