
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని కోర్టులో హాజరుపరచాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవ్‌జీ తమ్ముడి కుమార్తె సుమ ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు ఒక బహిరంగ లేఖను పోస్ట్ చేశారు.
శ్రీయుత గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారికి, నా పెదనాన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ గారు, మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమా? కాదా? అనేది మా కుటుంబానికి స్పష్టంగా తెలియడం లేదు, కానీ ప్రతిరోజూ వినిపించే ఈ సమాచారం మా కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే, దయచేసి ఆయనను కోర్టులో హాజరుపరచేలా చూడాలని లేదా లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని మా కుటుంబం తరపున మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటుంది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఆయన కోసం ఎదురు చూడని రోజు లేదండి….ఆయన కోసం వేచిచూస్తున్న సమయాన్ని మాటల్లో చెప్పలేం. సర్, మీపై మాకున్న నమ్మకం చాలా పెద్దది. ఒక అభిమానిగా, జనసేనా పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నం మా కుటుంబానికి మీరు తప్పకుండా న్యాయం చేస్తారని మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఈ ట్వీట్ మీవరకు చేరుతుందని, మీరు సానుకూలంగా స్పందిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం సార్.
ఇట్లు
సుమ తిపిరి
D/O గంగాధర్
9440113127 ,
6281695549
