
DSports 2 Dec:బెంగళూరు/హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. ఎం. చిన్నస్వామి స్టేడియంలో IPL 2026 మ్యాచ్‌ల నిర్వహణపై తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. స్టేడియం భద్రతకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను సమర్పించిన తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) నుంచి అధికారిక నోటీసు జారీ అయింది.
తొక్కిసలాట విషాదమే ప్రధాన కారణం
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఆ విజయోత్సవ సంబరాలు 2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగాయి. ఆ సమయంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
ఈ విషాదం తర్వాత, కర్ణాటక ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డి’కున్హా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ నివేదిక: చిన్నస్వామి స్టేడియం డిజైన్, నిర్మాణం భారీ జనసమూహాలను గుమి కూడటానికి అనువైనది లేదా సురక్షితమైనది కాదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
ప్రభుత్వ ఆదేశం: ఈ నివేదిక నేపథ్యంలోనే, స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లతో సహా పెద్ద ఈవెంట్ల నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటే, NABL ధ్రువీకరించిన నిపుణులతో రూపొందించిన వివరణాత్మక నిర్మాణ భద్రత నివేదిక (Safety Clearance Report)ను సమర్పించాలని PWD, KSCAను ఆదేశించింది.
ఈ నివేదిక ఆధారంగానే 2026లో చిన్నస్వామి మైదానంలో మ్యాచ్‌లను నిర్వహించాలా వద్దా అనే తుది నిర్ణయం తీసుకుంటారు.
