D Spiritual: Nov 28: వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. ఏ పని ప్రారంభించినా, ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలంటారు. వాస్తు శుభ, అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్మకం.

ఇక ఇంటి సంపదపై కూడా వాస్తు శాస్త్రం ప్రభావం ఉంటుంది. ఇంట్లో సంపద పెరగాలి అంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంటికి వస్తుంది, దానికి ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అన్న విషయాలను తెలుసుకోవాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండేలా సరైన వాస్తు నియమాలు పాటించడం ముఖ్యం.

లక్ష్మీదేవి ఇంటికి రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకే కొందరు సాయంత్రం వేళలో తలుపులు తెరిచే ఉంచుతారు. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందో చాలామందికి స్పష్టంగా తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో ఇంటిలోకి ప్రవేశిస్తుందట. అందువల్ల ఆ సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను తప్పకుండా పాటించాలంటున్నారు.

వాస్తు ప్రకారం సాయంత్రం వేళలో తులసి మొక్కను తాకడం చాలా అశుభకరం. ఆ సమయంలో తులసిని తాకితే లక్ష్మీదేవి దూరమై ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారు. అందుకే తులసిని సాయంత్రం వేళలో ముట్టుకోవద్దని సూచిస్తారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, ఇంటిలోకి ఆమె రావాలంటే సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలట. ఆ సమయంలో ఎవరి తలుపులు తెరిచి ఉంటాయో వారికి లక్ష్మీదేవి ఆనందంగా ప్రవేశిస్తుందని నమ్మకం.

అలాగే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎవరి ఇళ్లు అయితే శుభ్రంగా, ఏ మూలలో కూడా చిందరవందర లేకుండా ఉంటాయో, వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ శుభ్రమైన ఇంటిలో ఆమె కొన్ని రోజులు నివసిస్తుందని కూడా నమ్మకం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana