D Spiritual: Nov 28: మామూలుగా చాలా మంది పూజ చేసేటప్పుడు పూజ గదిలో చెంబుతో నీరు పెట్టుతూ ఉంటారు. ఇంకొందరు అస్సలు పెట్టరు. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా నీరు పెట్టాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పూజ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధివిధానాలు పాటిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా పూజలు జరుగుతాయి. ఈ కారణంగా పూజ సమయంలో వివిధ సందేహాలు రావడం సహజం. వాటిలో పూజ సమయంలో చెంబులో నీరు పెట్టాలా వద్దా అన్నది కూడా ఒక ముఖ్యమైన సందేహం.

పూజ గదిలో రాగి చెంబులో లేదా స్టీల్, ఇత్తడి వంటి పాత్రలో నీరు పెట్టడం మనం తరచూ చూస్తుంటాం. ఇలా నీటిని ఉంచి పూజ చేయడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహా నైవేద్యం కంటే కూడా ఈ రీతిగా నీటిని పెట్టడం వల్ల దేవతలు సంతోషించి మన కోరికలను నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు.

పూజ సమయంలో రాగి చెంబులో నీటిని పెట్టి మంత్రాలను పఠించడం, ఆ తర్వాత ఆ నీటిని తాగడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని చెబుతారు. అలాగే ప్రతిరోజు పూజ సమయంలో ఆ నీటిని తీర్థంగా సేవిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయట. సమస్త దోషాలు కూడా తొలగుతాయని విశ్వాసం.

చెంబులో పెట్టిన నీటిని ప్రతిరోజూ మార్చడంతో పాటు ఆ నీటిని చెట్లకు పోయాలట. ఇలా చేస్తే ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. అలాగే పూజ సమయంలో గంట మోగించడం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు దూరమవుతాయని చెబుతారు.

పూజ చేసేటప్పుడు ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తులు దగ్గరికి రాకపోవడమే కాకుండా, ఇబ్బందులు కూడా తొలగుతాయట. ప్రతి ఇంటిలోనూ పూజకు ముందు రాగి లేదా వెండి పాత్రలో నీటిని దేవుని ముందు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.

మనము పూజ చేసే సమయంలో పూజలో ఏర్పడే శక్తి మొత్తం ఆ పాత్రలోని నీటిలో నిక్షిప్తమై ఇంటికి మంచిని తెస్తుందని విశ్వాసం. పూజ చేసిన తర్వాత సేవించే తీర్థంలో భగవంతుడి శక్తి నిలిచి ఆ కుటుంబానికి శుభాలను చేకూరుస్తుందని చెబుతారు.

పూజకు ఉపక్రమించే ముందు పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి, తర్వాత రాగి చెంబును కొత్త నీటితో నింపి మాత్రమే పూజ చేయాలట. పాత నీటితో పూజ చేస్తే పూజకు ఎలాంటి ఫలితం ఉండదని, పైగా దేవతలకు ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana