D Spiritual: Nov 27: మీరు కూడా వెండి ప్రమిదలో దీపారాధన చేస్తున్నారా? అయితే ఏ దేవుడి ముందు వెండి దీపాలను వెలిగించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం మట్టి ప్రమిదలు, ఇత్తడి, రాగి ప్రమిదలు, కొంతమంది వెండి ప్రమిదలు ఉపయోగించి దీపారాధన చేస్తుంటారు. కొంతమంది కంచు ప్రమిదలను కూడా ఉపయోగిస్తారు. వీటిలో వెండి ప్రమిదలను ఉపయోగించేవారు తక్కువగానే ఉన్నప్పటికీ, ఆర్థిక స్థితిని బట్టి ఎవరికైనా వివిధ ప్రమిదలను ఉపయోగించి పూజ చేసే అవకాశం ఉంటుంది.

వెండి ప్రమిదల్లో దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ప్రత్యేకంగా చెప్పబడాయి. ఆది దేవుడైన విఘ్నేశ్వరుడి ముందు వెండి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ దీపం నెయ్యితో మాత్రమే వెలిగించడం మంచిదని చెబుతారు. సరస్వతి దేవి ముందు వెండి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగిస్తే అజ్ఞానం పోయి జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. లక్ష్మీ దేవి చిత్రపటం ముందు వెండి కుండు లో నెయ్యి దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రసాదమవుతాయట. చంద్రుడికి వెండి కుందిలో దీపం వెలిగిస్తే మనసుకు స్థిరత్వం కలుగుతుందని అంటారు. అలాగే శనివారంలో వెండి ప్రమిదలతో నవగ్రహాలకు దీపారాధన చేస్తే గ్రహదోషాలు తొలగుతాయని చెబుతారు.

ఈ విధంగా ప్రతి దేవుడి ముందు వెండి దీపం వెలిగించడం వల్ల వేర్వేరు ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అయితే తప్పనిసరిగా వెండి ప్రమిదలతోనే పూజ చేయాలన్న నియమం లేదు. పండితులు చెప్పిన ప్రకారం, ఆర్థిక పరిస్థితిని బట్టి ఇత్తడి, కంచు లేదా మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. అయితే ఏ ప్రమిదలో చేసినా దీపం కింద తప్పనిసరిగా చిన్న ప్లేట్ లేదా రావి ఆకులు ఉంచాలని సూచిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana