
DNews: 27 Nov: వివాహం ముందు జరిగే నిశ్చితార్థ వేడుకలు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది ఎంతో సందడి ఉంటుంది. బంధుమిత్రుల కోలాహలం ఉంటుంది. ఎవరికి ఏ లోటు రాకుండా వధూ వరుల కుటుంబాలు చూసుకుంటూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట అనేక వైరల్ అవుతాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది.
నవంబర్ 24 సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుకలో వంట చేసేటప్పుడు రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం రేపుతోంది. ఆ తర్వాత వంటవాడిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలో, వంటవాడు రోటీలపై ఉమ్మి వేస్తున్నట్లు చూడవచ్చు.
నిశ్చితార్థానికి హాజరైన బంధువులు ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేశారు. దీని తర్వాత, బాగ్‌పట్‌లోని సింఘవాలి అహిర్ నివాసి మహ్మద్ తౌసిఫ్ పై బాలెని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. వారి వల్ల మొత్తం నిశ్చితార్థం స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉందని ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
