D Spiritual: Nov 27: పూజలో ఉపయోగించే పువ్వుల ప్రాధాన్యం చాలా ఎక్కువ. పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు అంటారు. అందుకే ప్రతి పూజలో పువ్వులు తప్పనిసరిగా వాడుతుంటాము. పూజ చేసిన తర్వాత మాత్రం చాలా మంది ఆ పువ్వులను బయటకు పడేస్తూ ఉంటారు. ఇంకొందరు వాటిని ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి పూజలో ఉపయోగించిన పువ్వులను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం అవసరం.

నైవేద్యం లేకపోయినా పువ్వులు సమర్పించి దీపం పెట్టి నిత్యపూజ చేసే వారు చాలామంది ఉన్నారు. అయితే పూజలో సమర్పించే పుష్పాలను వాడిన తరువాత వాటిని మళ్లీ ఉపయోగించుకోవచ్చా అన్న సందేహం చాలామందికి ఉంటుంది. పువ్వులు దేవుడికి సమర్పించే పవిత్రమైనవి కావడంతో వాటిని అలా ఎక్కడపడితే అక్కడపడేయడం మంచిది కాదనే అభిప్రాయం ఉంది.

కొంతమంది పువ్వులను నదుల్లో లేదా పారే నీటిలో పడేస్తుంటారు. దేవుడికి సమర్పించిన పువ్వులను నేలపై పడేస్తే అవి తొక్కబడతాయనే భావన వల్ల అలా చేస్తున్నారు. కానీ పండితుల ప్రకారం ఇలా పువ్వులను నీటిలో పడేయకూడదు. ఇది పర్యావరణానికి హానికరం.

దేవుడి పూజకు వాడిన పువ్వులను వృథా చేయకుండా వాటితో కంపోస్ట్ తయారు చేయడం మంచి పద్ధతి. పువ్వులను ఇతర వ్యర్థాలతో కాకుండా నేరుగా చెట్టు వేళ్ల వద్ద మట్టిలో కలిపితే మట్టికి మంచి పుష్టి అందుతుంది. ఆ మట్టిలో పెరిగే మొక్కల పెరుగుదలకూ ఇది సహేతుకం.

ఇక ఇటీవల పూజలో ఉపయోగించిన పువ్వులతో ధూప్ స్టిక్స్, కోన్స్ వంటి వాటిని తయారు చేసి ఇంట్లో సువాసన కోసం వాడుతున్నారు కూడా. అయితే ఇవి ఇంటి ఉపయోగానికి మాత్రమే; ఈ విధంగా తయారైన వాటిని తిరిగి పూజలో మాత్రం ఉపయోగించరాదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana