
D Spiritual: Nov 26: సాధారణంగా దేవుడి విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు. దేవుడి విగ్రహాలతో పాటు మరికొన్ని పవిత్రమైన జంతువుల విగ్రహాలను కూడా ఇంట్లో ఉంచి పూజలు చేస్తారు. మన భారతదేశంలో ఆవును పవిత్రంగా భావించడం వల్ల కొంతమంది ఆవు విగ్రహాలను ఇంట్లో పూజిస్తారు. తాబేలు, ఏనుగు వంటి జంతువుల విగ్రహాలను కూడా పూజించే సంప్రదాయం ఉంది. ఏనుగును విగ్నేశ్వరుడి ప్రతిరూపంగా భావించినందున వెండితో తయారుచేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది. వెండి ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో లేదా దుకాణంలో ఉంచితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఫెంగ్ షుయ్ ప్రకారం వెండితో తయారుచేసిన ఏనుగు విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇళ్లలో, ఆఫీసుల్లో వెండి ఏనుగు ఉంచితే సంతోషకరమైన, శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది. అసలు ఏనుగును పెంచడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు కానీ అది అందరికీ సాధ్యం కాదని కారణంగా వెండి ఏనుగు రూపంలో ప్రతీకగా ఉంచుకోవచ్చు. అయితే ఏనుగు విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. వాస్తు నిపుణులు సూచించిన ప్రదేశంలో ఉంచినప్పుడు మాత్రమే ఇంట్లో శాంతి, సౌఖ్యం స్థిరంగా ఉంటాయని భావిస్తారు.
వ్యాపారంలో కూడా వెండి ఏనుగు విగ్రహం ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది. దుకాణాల్లో ఉంచేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో ఏనుగు విగ్రహాన్ని కట్టి, డబ్బు ఉంచే ప్రదేశం దగ్గర ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల వ్యాపారంలో పురోగతి, లాభాలు పెరుగుతాయని నమ్మకం ఉంది. నష్టాలు తొలగి, దుకాణానికి శ్రేయస్సు మరియు ఆకర్షణ అధికమవుతాయని భావిస్తారు.
