D Spiritual: Nov 26: ఇంట్లో ఉండే వ్యక్తుల జీవితాలపై వస్తువుల ప్రభావం ఉంటుందని చాలా మంది విశ్విస్తుంటారు. కేవలం వాస్తు మాత్రమే కాకుండా, ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా నివసించే వారి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా ప్రతికూల ప్రభావం కలిగించే వాటిలో వంటగదిలోని నళ్లా కూడా ఒకటిగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో కిచెన్‌లో ఉన్న నళ్లా లీక్ అయి చుక్క చుక్క నీరు కారుతూ ఉంటుంది. ఈ విధంగా నీరు వృథాగా పోవడం శుభం కాదని నిపుణుల అభిప్రాయం.

వాస్తు ప్రకారం కేవలం వంటగదిలోనే కాకుండా, ఇంట్లో ఏ నళ్లా లీక్ అవుతున్నా అది వ్యతిరేక శక్తులను పెంచుతుందని చెబుతారు. కుళాయి నుంచి నీరు వృథాగా కారడం అంటే ఇంట్లో దుబారా ఖర్చులు పెరుగుతున్న సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా వంటగదిలో నళ్లా లీక్ అయితే ఆర్థిక ప్రగతి ఆగిపోతుందని చెబుతారు. వంటగది అగ్నికి కేంద్రంగా ఉండటంతో, అగ్ని–నీటి అసమతుల్యత వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్పుతున్నారు.

అలాంటి లీకేజీ వల్ల కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని తెలిపారు. కుటుంబ సభ్యులు తరుచూ అనారోగ్యానికి గురవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఇంట్లో సంతోషం తగ్గిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే ఇంట్లో నీరు ప్రవహిస్తుంటే అది నెగటివ్ ఎనర్జీ పెరుగుతున్న సంకేతంగా భావిస్తారు. అందువల్ల ఇంట్లో ఎక్కడైనా నీరు లీక్ అవుతున్నప్పుడు వెంటనే రిపేర్ చేయించుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana