DSports 26 Nov: భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ వేదికల ఎంపికపై తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్న ఐదు వేదికల జాబితాను ఐసీసీ ఇటీవల విడుదల చేయగా, అందులో హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం), విశాఖపట్నం నగరాలకు చోటు దక్కకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. దేశంలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉన్న, అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగిన హైదరాబాద్, విశాఖపట్నం స్టేడియాలను బీసీసీఐ (BCCI) పక్కన పెట్టడం “దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం” చేయడమేనని సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. దక్షిణాది నుంచి చెన్నై ఒక్క నగరానికి మాత్రమే అవకాశం దక్కగా, పశ్చిమ, ఉత్తర భారత నగరాలకే ప్రాధాన్యత దక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేటాయింపుల వెనుక బీసీసీఐ అనుసరిస్తున్న రొటేషన్ పాలసీతో పాటు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అంతర్గత వివాదాలు కూడా మ్యాచ్‌లు దక్కకపోవడానికి కారణమై ఉండవచ్చని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana