DSports 26 Nov: టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్పై వస్తున్న విమర్శలను భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గట్టిగా ఖండించారు. జట్టు వైఫల్యాలకు కోచ్‌ను నిందించడం సరికాదని ఆయన గంభీర్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. “ఒక కోచ్ ఆటగాళ్లకు కేవలం మార్గనిర్దేశం చేయగలరు, సలహాలు ఇవ్వగలరు. కానీ, మైదానంలో పరుగులు చేయవలసిన, వికెట్లు తీయవలసిన బాధ్యత ఆటగాళ్లదే” అని రైనా స్పష్టం చేశారు. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, జట్టు గెలుపోటముల పూర్తి బాధ్యతను ఆటగాళ్లే తీసుకోవాలని, కోచ్‌ను పదవి నుంచి తొలగించాలనే వాదనలు సమంజసం కాదని రైనా అభిప్రాయపడ్డారు. గంభీర్ నేతృత్వంలో వైట్-బాల్ క్రికెట్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌ వంటి టైటిల్స్ గెలిచిందని కూడా రైనా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana