
DNews:26 Nov:హైదరాబాద్‌లో అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగుచూసింది. ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీసులు అధికారి తన సర్వీస్ రివాల్వర్‌ను కోల్పోయిన ఘటన చర్చనీయాంశమైంది.అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసిన ఓ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారు నగలతో పాటు ఎస్సై భాను ప్రకాశ్ సర్వీస్ రివాల్వర్ కూడా మిస్సింగ్ అయినట్లు తోటి సిబ్బంది తాజాగా గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఎస్సై స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయినట్లు సమాచారం.
ప్రాథమిక అనుమానాల ప్రకారం ఎస్సై ఆర్థిక ఇబ్బందుల కారణంగా రికవరీ చేసిన బంగారంతో పాటు తన సర్వీస్ గన్ను కూడా ఓ పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయమై విస్తృతంగా చర్చ జరుగుతోంది.ఈ ఘటనపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై భాను ప్రకాశ్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.ఈ సంఘటన పోలీస్ డిపార్ట్మెంట్లో తీవ్ర కలకలం రేపింది.
