
DNews: Nov 26: మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల హకింపేట డిపో సిబ్బందిపై గూండాలు దాడి చేసిన ఘటన మరువక ముందే, నర్సంపేటలో మత్తులో ఉన్న యువకులు మరోసారి ఆర్టీసీ డ్రైవర్‌పై రచ్చ చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొంతమంది ఎక్కి డ్రైవర్ పక్కన గేర్‌బాక్స్‌పై కూర్చున్నారు. తాము ఎమ్మెల్యే డోంతి మాధవరెడ్డి బంధువులమని చెప్పుకుంటూ మద్యం మత్తులో ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. డ్రైవర్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతనిపై దాడి చేశారు. వెంటనే బాధిత డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, దాడి చేసిన యువకులను ప్రయాణికులతో కలిసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
