
DSports 24 Nov: దోహా: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025’ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన పాకిస్థాన్-ఏ జట్టుకు ఆయన స్వయంగా ట్రోఫీని అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఏడాది (2025) సెప్టెంబర్‌లో జరిగిన సీనియర్ ఆసియా కప్ ఫైనల్ (భారత్ వర్సెస్ పాకిస్థాన్)లో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే, మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించింది.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి భారత్ సుముఖత చూపలేదు. దీంతో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది.నఖ్వీ ఈ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) కార్యాలయంలో ఉంచి, తన అనుమతి లేకుండా ఎవరికీ ఇవ్వకూడదని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.నియర్ జట్టు గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ భారత జట్టుకు అందలేదు, దుబాయ్‌లోని ACC కార్యాలయంలోనే ఉంది.
ఈ నేపథ్యంలో, నవంబర్ 23, ఆదివారం ఖతార్‌లోని దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏ జట్టును ఓడించి విజేతగా నిలిచింది.ఈ సందర్భంగా ఏసీసీ ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఉల్లాసంగా పాకిస్థాన్-ఏ జట్టు కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీకి ట్రోఫీని అందజేశారు.నఖ్వీ ట్రోఫీని అందజేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మరియు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. భారత్‌కు ట్రోఫీ ఇవ్వడానికి నిరాకరించి, ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు ట్రోఫీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మొత్తం మీద, సీనియర్ ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, జూనియర్ టోర్నమెంట్‌కు సంబంధించిన ట్రోఫీని నఖ్వీ పాకిస్థాన్ జట్టుకు అందించడం మరింత రాజకీయ, క్రీడాపరమైన చర్చకు దారి తీసింది.
