
DET:NOV 22:
ఉదయ్‌పూర్‌లో వైభవంగా పెళ్లి బాలీవుడ్ తారల సందడి:
అమెరికాకు చెందిన బిలియనీర్ ఫార్మా దిగ్గజం రామారాజు మంతెన గారి అమ్మాయి నేత్రా మంతెన,టెక్ ఎంట్రప్రెన్యూర్ వంశీ గడిరాజు వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి.ఈ పెళ్లి వేడుకకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు బాలీవుడ్ స్టార్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా సంగీత్ కార్యక్రమం ఒక స్టార్ నైట్‌లా జరిగింది.
షాహిద్ కపూర్ జాన్వీ కపూర్ ఎనర్జిటిక్ డ్యాన్సులు:
ఈ సంగీత్ వేడుకలో బాలీవుడ్ నటులు తమ పవర్ఫుల్ డ్యాన్స్‌లతో స్టేజ్‌ను దద్దరిల్లించారు. షాహిద్ కపూర్ తన హిట్ సినిమా జబ్ వుయ్ మెట్ లోని ఫేమస్ సాంగ్ మౌజా హి మౌజాకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక, యువ నటి జాన్వీ కపూర్ కూడా తనదైన శైలిలో అదరగొట్టింది. ఆమె తన చిత్రం పరం సుందరిలోని పరదేశియా పాటకు నాట్యమాడి అందరి దృష్టిని ఆకర్షించింది.
రణ్వీర్ సింగ్ హంగామా: ట్రంప్ జూనియర్ డ్యాన్స్:
ఈ వేడుకకు వచ్చిన అతిథుల్లో రణ్వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన సహజమైన ఎనర్జీతో స్టేజ్‌పై హంగామా చేశారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్ మరియు ఆయన స్నేహితురాలు కూడా ఈ వేడుకకు వచ్చారు. రణ్వీర్ సింగ్ వారిని స్టేజ్ పైకి ఆహ్వానించి తన సినిమా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలోని వాట్ ఝుమ్కా పాటకు స్టెప్పులు నేర్పించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇతర ప్రముఖుల పెర్ఫార్మెన్సులు:
ఈ సంగీత్‌లో కేవలం వీరే కాదు, ఇంకా చాలా మంది ప్రముఖులు సందడి చేశారు.కృతి సనన్ కూడా డ్యాన్స్‌తో మెప్పించగా వరుణ్ ధావన్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా తమ హిట్ పాటలకు పర్ఫార్మ్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ మరియు నటి సోఫీ చౌదరి ఈ వేడుకను హోస్ట్ చేశారు. అంతర్జాతీయ స్టార్స్ అయిన జెన్నిఫర్ లోపెజ్,జస్టిన్ బీబర్ కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరవుతున్నట్లు సమాచారం. మొత్తానికి, ఉదయ్‌పూర్ పెళ్లి వేడుకలు బాలీవుడ్ రంగులతో కళకళలాడుతున్నాయి.
